September 11, 2026
Praja Telangana
తెలంగాణ

మొంథా తుఫాన్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొంథా తుఫాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు. ముఖ్యంగా దండేపల్లి, లక్షేట్టిపేట్, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమిని, జైపూర్ మండలాల నదీ పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెట్లు, కరెంటు పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని కోరారు.

Related posts

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

*మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు:కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar
Share this