July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*గిరిజన జీవన విధానంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన ట్రైబల్ స్టడీస్ విద్యార్థులు*

ఆసిఫాబాద్, జూలై 13:గిరిజన సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, సామాజిక పరిస్థితులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడంతో పాటు గిరిజన జీవన విధానాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసే ఉద్దేశంతో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం నిర్వహిస్తున్న ట్రైబల్ స్టడీస్ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రౌటసంకపల్లి గ్రామంలో విద్యార్థుల ఫీల్డ్ స్టడీ నిర్వహించారు.ఈ అధ్యయన పర్యటనలో 20 మంది విద్యార్థులు పాల్గొని గ్రామంలోని గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక-ఆర్థిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేశారు. గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి జీవన శైలిని తెలుసుకుని గిరిజన సమాజ ప్రత్యేకతలను అధ్యయనం చేశారు.ఈ సందర్భంగా దత్తత గ్రామ కోఆర్డినేటర్ వెంకటేష్ కుమ్ర, ఎడ్ల బక్కయ్య పటేల్ గ్రామ చరిత్ర, స్థానిక పరిస్థితులు, గిరిజనుల జీవన విధానం, సంప్రదాయాల గురించి విద్యార్థులకు వివరించారు. ఇలాంటి క్షేత్ర అధ్యయనాలు విద్యార్థుల్లో సామాజిక అవగాహనను పెంపొందించడంతో పాటు గిరిజన సమాజంపై లోతైన అవగాహన ఏర్పడేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.అలాగే సామాజిక బాధ్యతలో భాగంగా ట్రైబల్ స్టడీస్ బృందం గ్రామంలోని చిన్నారులకు విద్యా ప్రోత్సాహకంగా నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేసింది.ఈ కార్యక్రమంలో అక్కల చంద్రమౌళి, కిరణ్, రామ్ ప్రసాద్, సంధ్య, బండేరావ్, అరుణ్ కుమార్, శ్యామ్, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*

షార్ట్ కట్ మార్గాల ప్రయాణం ప్రమాదం. సరైన మార్గమే సురక్షితం…

Share this