మంచిర్యాల,జూన్ 28:అంజనీపుత్ర రియల్ ఎస్టేట్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు.సంస్థపై వస్తున్న ఫేక్ వార్తలు, నకిలీ పీడీఎఫ్‌లు, ఆధారాలు లేని ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. అంజనీపుత్ర ఎప్పటి నుంచో పారదర్శక విధానాలతో ముందుకు సాగుతోందని, వినియోగదారుల నమ్మకమే తమకు ప్రధాన బలమని పేర్కొన్నారు.వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైర్మన్ గుర్రాల శ్రీధర్ హెచ్చరించారు. సంస్థపై దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి న్యాయపరంగా ఎదుర్కొంటామని, అవసరమైతే కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.అడ్డంకులను అధిగమిస్తూ అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ విశ్వసనీయతతో ముందుకు సాగుతోందని, సంస్థపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన అన్నారు. తప్పుడు ప్రచారాలతో సంస్థ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ప్రయత్నాలు విఫలమవుతాయని స్పష్టం చేశారు.

