October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*స్ట్రీట్ వెండర్లకు ఆర్థిక చేయూత.. టీజీబీ బ్యాంకులో పీఎం స్వనిధి లోక్ కళ్యాణ్ మేళా*

మంచిర్యాల,జూన్17:తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీఎం స్వనిధి పథకం ఆధ్వర్యంలో లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్ట్రీట్ వెండర్లు హాజరై పథకం వివరాలను తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు టీజీబీ బ్యాంకు రుణాలు మంజూరు చేసింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పథకం కింద మొదటి విడతలో రూ.15 వేల వరకు, రెండో విడతలో రూ.25 వేల వరకు, మూడో విడతలో రూ.50 వేల వరకు టర్మ్ లోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ రుణాలు చిన్న వ్యాపారాల విస్తరణకు, స్వయం ఉపాధి బలోపేతానికి దోహదపడతాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం చిన్న వ్యాపారులకు వరంగా మారిందన్నారు. రుణ సదుపాయాలను వినియోగించుకుని స్ట్రీట్ వెండర్లు తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా తదుపరి దశల్లో అధిక మొత్తంలో ఆర్థిక సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.వ్యాపారాభివృద్ధితో పాటు కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు ఈ పథకం దోహదపడుతోందన్నారు.ఈకార్యక్రమంలో టీజీబీ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ స్వామి,మెప్మా సిఓ అరుణ, కమ్యూనిటీ ఆర్గనైజర్ సరోజ, స్ట్రీట్ వెండర్లు, రిసోర్స్ పర్సన్లు, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*వార్తలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు.. ముగ్గురు విలేకరులపై కేసు నమోదు*

రాజీవ్ గాంధీ, ఆశయాలను,కొనసాగించాలి ఎమ్మెల్యే గడ్డం వినోద్,

*ప్రజల ప్రాణాలే లక్ష్యం.. ప్రమాదకర రహదారిపై పోలీసుల తక్షణ స్పందన – దెబ్బతిన్న వంతెన వద్ద మరమ్మతులు, రాకపోకలకు భద్రతా చర్యలు*

Share this