June 17, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి*

మంచిర్యాల, జూన్ 17:సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో, సమగ్రంగా అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమాచార హక్కు చట్టం అమలుపై సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం అమలు మరింత సమర్థవంతంగా జరిగేలా అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్దేశిత గడువులోగా అందించడంతో పాటు, దరఖాస్తుదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా స్థానిక భాష తెలుగులో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం శాఖ లక్ష్యాలు, విధులు, ఉద్యోగుల హోదాలు, సేవల వివరాలు స్వచ్ఛందంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని, సంబంధిత రికార్డులు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.గడువు ముగిసిన తర్వాత సమాచారం అందించాల్సి వచ్చిన పక్షంలో దరఖాస్తుదారునికి ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, నిర్లక్ష్యం లేదా జాప్యానికి పాల్పడిన అధికారులపై రూ.25 వేల వరకు జరిమానా విధించడంతో పాటు క్రమశిక్షణ చర్యలకు కూడా ఆదేశించే అధికారం సమాచార కమిషన్‌కు ఉందని హెచ్చరించారు.రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ పనితీరును తెలుసుకునే, ప్రజాధనం వినియోగాన్ని పర్యవేక్షించే హక్కును కల్పించిందన్నారు.పారదర్శక పాలన, జవాబుదారీతనం పెంపొందించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చట్టం రూపుదిద్దుకోవడానికి జరిగిన సామాజిక ఉద్యమాలను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు కీలక సాధనమని అన్నారు.సమావేశంలో మెసిన్ పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డి సమాచార హక్కు చట్టంలోని వివిధ సెక్షన్లు, నిబంధనలు, రుసుములు, గడువులు, విచారణ విధానం, జరిమానాలు, క్రమశిక్షణ చర్యలపై వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం సమావేశానికి హాజరైన రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్‌కు సమాచార హక్కు వికాస సమితి మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిషనర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.ఈ సన్మాన కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ బత్తుల సతీష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ్ కిషన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ కార్యదర్శి నరేష్, టౌన్ కమిటీ సభ్యుడు జల్ఫెక్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంబీసీ డిఎన్టి ల న్యాయబరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Chief Editor: Satish Kumar

బెల్లంపల్లి ఎమ్మెల్యే & మంత్రి సీతక్కకు మెమోరాండం అందించిన బండి ప్రభాకర్ యాదవ్

Share this