June 3, 2026
Praja Telangana
తెలంగాణ

మూడు దశాబ్దాల ప్రజాసేవకు వీడ్కోలు___ హోంగార్డ్ శ్రీనివాస్‌కు పోలీస్ శాఖ ఘన నివాళి

గోదావరిఖని, మే 23:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ బి. శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం గోదావరిఖని శ్రీనగర్ కాలనీ (వినాయక్ నగర్)లోని ఆయన నివాసానికి వెళ్లిన డీసీపీ, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. 1996లో హోంగార్డ్‌గా సేవలో చేరిన శ్రీనివాస్ దాదాపు మూడు దశాబ్దాల పాటు నిజాయితీ, క్రమశిక్షణతో పోలీస్ శాఖలో సేవలందించారని కొనియాడారు. ప్రజా సేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత సహచరులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన మరణం పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం, మనోబలం కలగాలని కోరుతూ, పోలీస్ శాఖ తరఫున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి, రామగుండం సీఐ కృష్ణ, హోంగార్డ్ ఆర్‌ఐ పెద్దన్న, ఎంటీవో మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

Share this