September 11, 2026
Praja Telangana
తెలంగాణ

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నీల్వాయిలో పర్యావరణ చైతన్యం

నీల్వాయి (వేమనపల్లి), మే 20:అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా వేమనపల్లి మండలం నీల్వాయిలో బుధవారం “ప్రకృతిమిత్ర” సంస్థ ఆధ్వర్యంలో జీవ వైవిధ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విత్తన బంతులు చల్లుతూ, మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు చైతన్యం కల్పించారు.ప్రకృతిమిత్ర వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ మానవ మనుగడ జీవ వైవిధ్యంపై ఆధారపడి ఉందన్నారు.అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.సర్పంచ్ చెన్నూరు సమ్మయ్య గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి హఫీజుద్దీన్,ఎమ్‌పీడీఓ కుమారస్వామి, మండల పంచాయతీ అధికారి వెంకటేష్, గోగు సురేష్, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*చేయూత సామాజిక భద్రత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

*కౌమార బాలబాలికల ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

మహానాడు 2025 వేడుకకు అందరూ కదలిరండి

Share this