July 28, 2026
Praja Telangana
తెలంగాణ

మంచిర్యాల విద్యాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన డా. రవికాంతరావుకు ఘన సన్మానం: గుండేటి యోగేశ్వర్

తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్ఐఈటి) ప్రొఫెసర్ డా. కె. రవికాంతరావు ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లోని వయోజన విద్యా కార్యాలయానికి వచ్చిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ రక్షణ “వాల్టా” అథారిటీ రాష్ట్ర సభ్యుడు, పర్యావరణవేత్త, జిల్లా విద్యాశాఖ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పుష్పమాల, శాలువా, సన్మాన పత్రాన్ని అందజేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.డా. రవికాంతరావు అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేనిదని యోగేశ్వర్ పేర్కొన్నారు. అలాగే మంచిర్యాల జిల్లా తొలి విద్యాశాఖ అధికారిగా జిల్లా విద్యాభివృద్ధికి డా. రవికాంతరావు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.అనంతరం డా. రవికాంతరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గుండేటి యోగేశ్వర్ నిరంతరం అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు. “ప్రకృతి మిత్ర” సంస్థ ద్వారా రాష్ట్రస్థాయిలో చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.

Related posts

డెంగ్యూ నివారణకు ప్రజల సహకారం అవసరం: మేయర్ ధరణి మధుకర్_ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.అనిత

*సేవా స్పూర్తికి ప్రతిరూపాలు వైద్యులు___జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం*

Chief Editor: Satish Kumar

*పదోన్నతితో ఎస్సైగా బదిలీ.. ఆదిమూలం సత్తయ్యకు ఘన వీడ్కోలు*

Share this