September 11, 2026
Praja Telangana
తెలంగాణ

యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం_సిపి అంబ కిషోర్ ఝూ

మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ సీసీసీ నస్పూర్‌లో గంజాయి వినియోగం,దాని దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని,ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా,వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రైల్వే స్టేషన్లు,బస్ స్టేషన్లు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.

Related posts

బీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*పోలీస్ అధికారుల సంఘానికి కొత్త నాయకత్వం.. నవీన్, ఓంకార్‌కు ఘన సన్మానం*

Share this