July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్.. 41 వాహనాలు సీజ్*

జైపూర్,జూలై 17:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జైపూర్ ఇన్‌స్పెక్టర్ నవీన్,ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల నివాస బ్యారక్‌లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో 22 మోటార్ సైకిళ్లు,6 మినీ బస్సులు,9 ట్రాలీ వాహనాలు,4 ఆటోరిక్షాలు కలిపి మొత్తం 41 వాహనాలను సీజ్ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులతో సమావేశమై పలు సూచనలు చేశారు.తమ స్వగ్రామ పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొనే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తీసుకొచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు.కార్మికులు నివసించే బ్యారక్‌ల పరిసరాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించారు.గంజాయి,ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని,వాటి కొనుగోలు, విక్రయం,రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్న,అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఇతర రాష్ట్రాల కార్మికులు స్థానిక చట్టాలను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని,ఆధార్,గుర్తింపు కార్డులు వంటి ధ్రువీకరణ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలని,తమ పూర్తి వివరాలను ప్లాంట్ యాజమాన్యం వద్ద నమోదు చేయించాలని సూచించారు.గొడవలు,మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం,చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొనడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని,అపరిచితుల ఫోన్ కాల్స్,సందేశాలు,లింకులు,ఓటీపీలు,బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. మోసపూరిత ఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.ప్రతి కార్మికుడు చట్టాలను పాటిస్తూ పరస్పర సహకారంతో వ్యవహరిస్తే సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని, ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఇన్‌స్పెక్టర్ నవీన్,ఎస్సై రాజేందర్,ఎస్‌ఐ భూమేష్, ప్లాంట్ యాజమాన్య ప్రతినిధులు,ఇతర పోలీసు సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పూర్వ విద్యార్థుల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు క్రీడా సామగ్రి అందజేత

మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

Share this