July 28, 2026
Praja Telangana
తెలంగాణ

ప్రభుత్వ అవకాశాలతో పిల్లలు ఉన్నత శిఖరాల దిశగా ఎదగాలి: మేయర్ మధుకర్

పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆఫ్టర్ కేర్ కార్యక్రమానికి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బాలల భద్రత, రక్షణ వారాన్ని మే 2వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు పైన సోమవారం రోజున చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ లో ఉన్న పిల్లలకు అవసరమైన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, కుల దృవీకరణ, బ్యాంక్ ఖాతా, జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: ఎస్‌ఐ జే. శ్రీధర్*

*మాతా శిశు సంరక్షణ కేంద్రం, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవల మెరుగుపై ఆదేశాలు*

Share this