September 11, 2026
Praja Telangana
తెలంగాణ

రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి __సంక్షేమ,అభివృద్ధికి నిధుల భరోసాపై చర్చ

డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, పెండింగ్ ఆర్థిక అంశాలపై చర్చించారు.ఎక్సైజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్లు,మైనింగ్ శాఖల ఆదాయంపై సమీక్ష జరిపి, ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలపై దృష్టి సారించారు.వనరుల వినియోగంలో పారదర్శకత పాటించాలని,సంక్షేమం–అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,డి.శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర కార్మిక సంఘాల వేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9 కి వాయిదా

Chief Editor: Satish Kumar

*సర్వే ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar

*హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, సురక్షిత మాతృత్వంపై ఆరోగ్య కార్యకర్తలకు రీ-ఓరియంటేషన్ శిక్షణ*

Share this