July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*ఎస్‌ఐఆర్ ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జనసేన నాయకులు – ఇంటింటికీ వెళ్లి వివరాలు అందజేత*

చెన్నూరు,జులై 8:చెన్నూరు నియోజకవర్గ పట్టణ పరిధిలో ఎస్‌ఐఆర్ (SIR) ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాల అవసరం, వాటిని ఎక్కడ పొందాలి, ఎలా పూరించాలి అనే అంశాలపై పూర్తి సమాచారం అందిస్తూ ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ సిద్దు,కార్యకర్తలు
ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలను స్వయంగా అందజేసి, వాటిని సక్రమంగా ఎలా నింపాలనే విషయాన్ని వివరించారు.ఫారాల పూరింపులో అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సందేహాలను నివృత్తి చేస్తూ అవసరమైన సూచనలు చేశారు.అనంతరం పార్టీ నాయకుడు సిద్దు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ఫారాల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఫారాల పూరింపుకు సంబంధించిన ప్రతి అంశంలో జనసేన పార్టీ జనసైనికులు ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఎవరైనా ఎస్‌ఐఆర్ ఫారాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదా సందేహాలు ఉన్నా, 24 గంటల పాటు జనసైనికులు అందుబాటులో ఉండి అవసరమైన సహాయం అందిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,జనసైనికులు,స్థానిక కార్తలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

Related posts

గూడెంలో పోలీసుల అవగాహన సదస్సు.. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కీలకం

తాండూర్, అండర్ బ్రిడ్జిలో వాటర్ జామై ఇబ్బంది పడుతున్న జనం

అరుదైన “మే పుష్పం”తో ఆకట్టుకుంటున్న గుండేటి యోగేశ్వర్ ప్రకృతి మిత్ర నిలయం

Share this