July 28, 2026
Praja Telangana
తెలంగాణ

గంగావతరణ సాధకుడు శ్రీ భగీరథ మహర్షి

శ్రీ భగీరథ మహర్షి భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యంత గౌరవనీయులైన మహర్షుల్లో ఒకరు. తన పూర్వీకుల విముక్తి కోసం గంగానదిని భూమికి తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఆయన దీర్ఘకాలం ఘోర తపస్సు చేశారు. ఆయన అచంచల భక్తి, పట్టుదలతో దేవతలను ప్రసన్నం చేసి గంగాదేవిని భూమికి ఆహ్వానించారు.గంగానది ఉగ్ర ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదని గ్రహించిన భగీరథుడు పరమశివుని ప్రార్థించగా, శివుడు తన జటాలలో గంగాను ఆవహించి సజావుగా భూమిపై ప్రవహించేలా చేశాడు. ఈ విధంగా గంగానది భూమిపై ప్రవహించి కోట్లాది ప్రజలకు జీవనాధారంగా మారింది.భగీరథుని జీవితం మనకు గొప్ప స్పూర్తి. కఠినమైన లక్ష్యాలు అయినా ధృఢ సంకల్పం, కృషి, భక్తితో సాధ్యమవుతాయని ఆయన నిరూపించారు. సమాజానికి మేలు చేసే పనుల్లో ముందుండటం, బాధ్యతతో జీవించడం ఆయన మనకు నేర్పిన ప్రధాన పాఠాలు.శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా, ఆయన ఆశయాలను అనుసరించి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సంకల్పిద్దాం.

Related posts

ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎరుకాల కులస్తులకు అవకాశం కల్పించాలి*

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

Share this