September 11, 2026
Praja Telangana
తెలంగాణ

మంచిర్యాలలో డయాలసిస్ సేవల విస్తరణ

మంచిర్యాల జిల్లాలో డయాలసిస్ సేవల విస్తరణకు చర్యలు ప్రారంభమయ్యాయి.లక్షెట్టిపేట, వేమనపల్లి,భీమిని కేంద్రాలలో ఐదు చొప్పున డయాలసిస్ బెడ్స్ ఏర్పాటు చేయాలని,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో రెండు బెడ్స్ పెంచాలని త్రీ-మెన్ కమిటీ పరిశీలించింది. కేంద్రాలలో వైద్య సిబ్బంది, పేషంట్ కేర్, ల్యాబ్, నీటి సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి నివేదికను జిల్లా కలెక్టర్, ఆరోగ్యశాఖ కమిషనర్‌కు సమర్పించనున్నారు. ఈ చర్యలతో డయాలసిస్ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా డయాలసిస్ రోగులకు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ అప్పల ప్రసాద్, డిపిఓ ప్రశాంతి, నర్సింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్‌ఎస్సెస్ 7 రోజుల ప్రత్యేక శిబిరం ప్రారంభం

*ఆదివాసీల హక్కులు, సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం*

Chief Editor: Satish Kumar

*అనాథ కుటుంబానికి ‘అంజనిపుత్ర’ అభయహస్తం.. రూ.10 వేల ఆర్థిక సాయం*

Share this