September 11, 2026
Praja Telangana
తెలంగాణ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స – ఆరోగ్య పరిస్థితి స్థిరంగా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan గారికి శనివారం సాయంత్రం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా, అందులో భాగంగా ఎం.ఆర్‌.ఐ. స్కాన్ కూడా చేశారు. పరీక్షల ఫలితాలను పరిశీలించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి, అదే రోజు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.వైద్యుల సూచనల ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే పూర్తి ఆరోగ్యం కోలుకోవడానికి కొంత కాలం పాటు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

Related posts

సింగరేణి వార్షిక లక్ష్యం చేరుకోవాలంటే అన్ని ప్లేడే లను వర్కింగ్ డేస్ చెయ్యాలి (HMS డిమాండ్

*యువత ఉద్యోగాలే లక్ష్యంగా కష్టపడాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ*

*లక్ష్య సాధనకు సంకల్పం.. క్రమశిక్షణే కీలకం*

Share this