మంచిర్యాలలో కాంగ్రెస్ ‘మోసపూరిత రాజకీయాలు’ చేస్తుందని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు
మంచిర్యాల ఎన్నికల రాజకీయం హీటెక్కింది. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు బరితెగించి బిజెపి కార్య కర్తలను అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని బీజేపీ లీగల్ సెల్ సభ్యు డు ఆర్.వి.పవన్ మైత్రేయ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని వారి చర్యలను పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

