July 28, 2026
Praja Telangana
తెలంగాణ

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..

నాంపల్లి,హైద్రాబాద్,నవంబర్ 29 (సూర్యరేఖ) జాగృత్ హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ ల చొరవలో భాగంగా హైదరాబాద్ నగర సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు ప్రజలలో సైబర్ నేరాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా మెహదీపట్నంలోని రైతు బజార్ బస్టాప్లో కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ నగర అడిషనల్ సిటీ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ క్రైమ్స్,అతిధులుగా వి.అరవింద్ బాబు అడిషనల్ డీసీపీ క్రైమ్స్,సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర పోలీసులు సైబర్ నేరాలను ఎదుర్కోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.పౌరులను ఈ ఉద్యమంలో చేరమని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కుల్సుంపుర ఏసీపీ,ఆసిఫ్ నగర్ ఎసిపి, గోషామహల్ ఎసిపి మరియు సౌత్ వెస్ట్ జోన్ కు సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు,ఎస్సైలు,ఎఎస్సైలు,వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అక్రమ పశువుల రవాణాపై డీసీపీ ఉక్కుపాదం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Chief Editor: Satish Kumar

మంచిర్యాల కలెక్టర్‌ కుమార్ దీపక్ కు జల్ సంచయ్ జన్ భాగిదారి అవార్డు

Share this