July 28, 2026
Praja Telangana
తెలంగాణ

గుర్తింపు సంఘంతో 12 వ నిర్మాణాత్మక  సమీక్షా సమావేశం

గుర్తింపు సంఘంతో 12 వ నిర్మాణాత్మక  సమీక్షా సమావేశం

ఉద్యోగుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత

ఏరియా జిఎం రాధాకృష్ణ

సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతలోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం జిఎం ఎన్ రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు సంఘం (ఏ‌ఐ‌టి‌యుసి) యూనియన్ తో నిర్వహించిన 12 వ నిర్మాణాత్మక  సమీక్షా సమావేశం (స్ట్రక్చర్ మీటింగ్) లో గడిచిన సమావేశంలో జరిగిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా స్పందించిన జీఎం గుర్తింపు సంఘం నాయకులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకమని అన్నారు. ఇదివరకు సహకరించిన విదంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం విజయ ప్రసాద్, మందమర్రి ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, రామకృష్ణాపూర్ ఏఐటియుసి అక్బర్ అలీ, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఎస్.కె గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, కే.కే ఓ.సి ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, ఐఈడి ఎస్.ఈ కిరణ్ కుమార్, సీనియర్ పిఓ సందీప్, ఏఐటీయూసీ మందమర్రి వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఏఐటీయూసీ స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సి.వి రమణ, ఇప్పకల లింగయ్య మందమరి ఏరియా ఉన్నత అధికారులు, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*మహిళల భద్రతకు షీ టీమ్ అండ___ పెద్దంపేట గ్రామ సభలో అవగాహన సదస్సు…. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన: షి టీం ఎస్ఐ ఉషారాణి*

Chief Editor: Satish Kumar

తెలంగాణకు తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత

“నో టు డ్రగ్స్ – ఎస్ టు ఎక్సర్‌సైజ్”తో ఆరోగ్య తెలంగాణ సాధ్యం : కలెక్టర్ కుమార్ దీపక్

Share this