September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్*

హైదరాబాద్, జూలై 16: కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.అనంతరం పవన్ కళ్యాణ్ నివాసంలోని వ్యక్తిగత లైబ్రరీని అబ్దుల్ నజీర్ సందర్శించారు. లైబ్రరీలో ఉన్న ప్రముఖ రచయితలు, స్కాలర్లు, విశ్లేషకులు, ప్రజా విధాన నిపుణులు రచించిన పలు పుస్తకాలను పరిశీలించి, వాటిపై పవన్ కళ్యాణ్‌తో ఆసక్తికరంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఒక పుస్తకంపై అబ్దుల్ నజీర్ తన ఆటోగ్రాఫ్ చేశారు.
ఈ సందర్భంగా తన ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చి పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

*ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ.. పరిష్కారానికి సీపీ ఆదేశాలు *

*డిగ్రీ సీటు జూలై1వ తేదీలోపు కన్ఫామ్ చేసుకోగలరు*

Chief Editor: Satish Kumar

ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక&స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ

Share this