June 3, 2026
Praja Telangana
తెలంగాణ

స్థానికుల సంక్షేమం, భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు

స్థానికుల సంక్షేమం, భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు

మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్

బెల్లంపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నెన్నెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖర్జీ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలో ఉన్న గుడిమల్ల మమత సహకారంతో మొత్తం 150 రగ్గు దుప్పట్లు అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ దుప్పట్లు పంపిణీ చేశారు.
డీసీపీ మాట్లాడుతూ, చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గిరిజన వృద్ధులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు స్వయంగా గ్రామాలకు చేరుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజల సంక్షేమం, భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రజల అండతో పోలీసు వ్యవస్థ మరింత బలపడుతుందని డీసీపీ అభిప్రాయపడ్డారు.
దుప్పట్లు డొనేట్ చేసిన అమెరికాకు చెందిన గుడిమల్ల మమతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ సిహెచ్. హనోక్, నెన్నెల్ ఎస్‌ఐ ప్రసాద్, నెన్నెల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి_ జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య

Chief Editor: Satish Kumar

సమ్మర్ కోచింగ్ క్యాంపులు – 2026 ప్రారంభం:జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారి

Chief Editor: Satish Kumar

రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం

Share this