September 11, 2026
Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి, నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

బెల్లంపల్లి, నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ ప్రాంతానికి చెందిన దూనేటి లావణ్య, అక్కల సుమలత నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇల్లు బుధవారం పూర్తి కాగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్ మనోజ్ ముఖ్యఅతిథిగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో తమ సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కారుకూరి రామచందరు, తొంగల మల్లయ్య, మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్, మాజీ సర్పంచ్ మంద అనిత, భామండ్లపల్లి భరత్, తోకల మల్లేష్, బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, ఎంపీఓ వేదాల శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ బోర్కుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టర్ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం

విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సైకాలజిస్టుల పాత్ర కీలకం: టిపిఏ

Chief Editor: Satish Kumar

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Share this