September 11, 2026
Praja Telangana
తెలంగాణ

వాట్సాప్‌లోనే మీ-సేవా

వాట్సాప్‌లోనే మీ-సేవా_

_ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్‌ ద్వారా మీ-సేవా(MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు._

_దీంతో ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ అవసరం లేకుండా, కేవలం వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పంపితే సరిపోతుంది._

_580కి పైగా ప్రభుత్వ సేవలు ఒకే వాట్సాప్ నంబర్‌లో_

_ప్రస్తుతం రాష్ట్రంలోని 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇది దేశంలోనే అత్యంత పెద్ద డిజిటల్ సేవల ఇంటిగ్రేషన్‌గా భావిస్తున్నారు._

_✔️ ఇన్‌కం సర్టిఫికేట్_
_✔️ బర్త్ సర్టిఫికేట్_
_✔️ క్యాస్ట్ సర్టిఫికేట్_
_✔️ డెత్ సర్టిఫికేట్_
_✔️ విద్యుత్ బిల్లుల చెల్లింపు_
_✔️ నీటి బిల్లులు_
_✔️ ఆస్తి పన్నులు_

_ప్రజలు రోజూ ఉపయోగించే దాదాపు అన్ని సర్వీసులు ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లభ్యమవుతున్నాయి._

_ప్రజలు సేవలను ఎలా పొందాలి?_

_సేవలను పొందడం చాలా సులభం:_

_WhatsApp: 80969 58096_
_ఈ నంబర్‌కు ‘Hi’ అని పంపాలి._
_ఆటోమేటిక్ మెను వస్తుంది._
_కావలసిన సేవను సెలెక్ట్ చేసుకుని దరఖాస్తు చేయొచ్చు._

_ఈ ప్రక్రియ పూర్తిగా సులభమైనది, వేగవంతమైనది, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకారి. ఈ కొత్త ఫీచర్‌తో సేవలలో పారదర్శకత, వేగం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. పౌరులు ఎక్కడ ఉన్నా, ఎప్పుడు కావాలన్నా ప్రభుత్వ సేవలను(MeeSeva) తక్షణం పొందగలరు._

Related posts

గంగావతరణ సాధకుడు శ్రీ భగీరథ మహర్షి

రాష్ట్ర ప్రభుత్వ “వాల్టా” చట్టం అథారిటీ సభ్యులుగా యోగేశ్వర్.* మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బాధ్యతల స్వీకరణ.

ఎంబీసీ డిఎన్టి ల న్యాయబరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Chief Editor: Satish Kumar
Share this