July 28, 2026
Praja Telangana
తెలంగాణ

మంచిర్యాల కలెక్టర్‌ కుమార్ దీపక్ కు జల్ సంచయ్ జన్ భాగిదారి అవార్డు

మంచిర్యాల కలెక్టర్‌ కుమార్ దీపక్ కు జల్ సంచయ్ జన్ భాగిదారి అవార్డు

మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందారు. నూతన ఆవిష్కరణలు, ప్రజా భాగస్వామ్యంతో నీటి సంరక్షణలో విశేష ఫలితాలు సాధించినందుకు గాను మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జల్ సంచయ్ జన్ భాగిదారి అవార్డును స్వీకరించారు. జిల్లాలో నీటి వనరుల అభివృద్ధికి, చెరువుల పునరుద్ధరణకు, గ్రామస్థాయిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ చేసిన కృషి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది. కార్యదీక్ష, క్రమశిక్షణ, ప్రజా సేవ పట్ల నిజాయితీతో పనిచేసే అధికారి అనే పేరును మరింత బలపరుచుకున్న కలెక్టర్ కుమార్ దీపక్ కు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న కలెక్టర్ కుమార్ దీపక్‌కు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలు అభినందనలు తెలిపారు.

Related posts

కలెక్టర్ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం

Share this