September 11, 2026
Praja Telangana
తెలంగాణ

శభాష్ దేవాపూర్ పోలీస్ అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడిన దేవాపూర్ ఎస్‌ఐ గంగారం,

శభాష్ దేవాపూర్ పోలీస్ అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడిన దేవాపూర్ ఎస్‌ఐ గంగారం,

దేవాపూర్ ప్రాంతంలో ఉదయం చోటుచేసుకున్న ఘటనలో, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించి ప్రాణాలను రక్షించడంలో దేవాపూర్ పోలీసులు చొరవ చూపారు.ఉదయం సుమారు 8 గంటల సమయంలో కాల్వల తిరుపతి అనే వ్యక్తి తన భార్యతో వివాదం తలెత్తడంతో నేను చచ్చిపోతా అంటూ ఇంటి నుండి వెళ్లిపోయాడు. చాలా సేపు గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా తిరుపతి కనిపించలేదు. దీంతో అతని పెద్ద కుమారుడు దేవాపూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పిర్యాదు చేశాడు.
పిర్యాదు అందుకున్న వెంటనే ఎస్‌ఐ గంగారం ప్రతిస్పందించి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో తిరుపతి లొకేషన్‌ను కేవలం గంటలోనే గుర్తించారు. ఆయన దేవాపూర్‌లోని సల్పల వాగు సమీప అటవీ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసిన వెంటనే ఎస్‌ఐ గంగారం, తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.అటవీ ప్రాంతంలో ఒక చెట్టు కింద తిరుపతి అపస్మారక స్థితిలో పడిఉన్నట్లు గమనించడంతో వెంటనే అతన్ని బయటకు తీసి ప్రాథమిక సహాయం అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందుతోంది.దేవాపూర్ పోలీసుల వేగవంతమైన చర్యతో ఒక ప్రాణం నిలబెట్టబడింది.

Related posts

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి

Chief Editor: Satish Kumar

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Chief Editor: Satish Kumar

శ్రీ విశ్వనాథ ఆలయంలో కూచిపూడి నృత్య కళా వైభవం

Share this