October 28, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాల బస్టాండ్‌లో భద్రత కోసం మరో 10 సీసీ కెమెరాల ఏర్పాటు*

మంచిర్యాల,అక్టోబర్ 14(నేటి ప్రజా తెలంగాణ):ప్రయాణికులు, ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేయడంతో పాటు బస్టాండ్‌లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంచిర్యాల బస్టాండ్‌లో మరో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఈ కెమెరాలను బిగించారు. గతంలో బస్టాండ్‌లో ఆరు సీసీ కెమెరాలు ఉండగా, తాజాగా మరో పది ఏర్పాటు చేయడంతో మొత్తం కెమెరాల సంఖ్య 16కు చేరింది. వీటి ద్వారా బస్టాండ్ పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు ప్రజల భద్రతకు మరింత భరోసా కల్పించనున్నారు.

Related posts

ఘనంగా ప్రపంచ నృత్య దినోత్సవం: భావాలను పలికించే నృత్యం – సంస్కృతిని నిలబెట్టే శక్తి

Chief Editor: Satish Kumar

జిల్లా కలెక్టర్, డీసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ పీఓ మంద మకరందు

*గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం.. నిర్మానుష్య ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు*

Share this