మంచిర్యాల,అక్టోబర్ 14(నేటి ప్రజా తెలంగాణ):ప్రయాణికులు, ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేయడంతో పాటు బస్టాండ్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంచిర్యాల బస్టాండ్లో మరో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఈ కెమెరాలను బిగించారు. గతంలో బస్టాండ్లో ఆరు సీసీ కెమెరాలు ఉండగా, తాజాగా మరో పది ఏర్పాటు చేయడంతో మొత్తం కెమెరాల సంఖ్య 16కు చేరింది. వీటి ద్వారా బస్టాండ్ పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు ప్రజల భద్రతకు మరింత భరోసా కల్పించనున్నారు.

