October 26, 2026
Praja Telangana
తెలంగాణ

*వెంకటాపూర్‌లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభం*

మందమర్రి, అక్టోబర్ 8 (నేటి ప్రజా తెలంగాణ): విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. సర్పంచ్ సిగ్యం వెంకటేష్ ఆధ్వర్యంలో వెంకటాపూర్, కాలనీ గుడిపల్లి పాఠశాలల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ సిగ్యం వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై ఏకాగ్రతతో దృష్టి సారించగలరని తెలిపారు. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు విద్యపై ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*లింగాపూర్ ఆరోగ్య ఉపకేంద్రంలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ*

వేధింపులకు వెంటనే ఫిర్యాదు చేయండి__సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ.హైమ

Share this