రామకృష్ణాపూర్,అక్టోబర్ 1(నేటి ప్రజా తెలంగాణ): రామకృష్ణాపూర్ పట్టణ పరిధిలో పోయిన పర్సును సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించి 24 గంటల్లోనే బాధితుడికి అప్పగించి రామకృష్ణాపూర్ పోలీసులు ప్రశంసలు అందుకున్నారు.కాసిపేట మండలానికి చెందిన సింగరేణి ఉద్యోగి బెజ్జురీ సంజయ్ సెప్టెంబర్ 30న పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్తుండగా గాంధారి మైసమ్మ దేవాలయం సమీపంలోని హైవే రోడ్డుపై తన పర్సును పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా పర్సు లభించకపోవడంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.వెంటనే స్పందించిన పోలీసులు గాంధారి మైసమ్మ దేవాలయం సమీపంలోని హైవేపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. హెడ్ కానిస్టేబుల్ జంగు పర్యవేక్షణలో కానిస్టేబుల్ వెంకటేష్ సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పర్సును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్టోబర్ 1న పర్సును బాధితుడు బెజ్జురీ సంజయ్కు అందజేశారు.పోయిన పర్సును సకాలంలో గుర్తించి తనకు అందజేసిన రామకృష్ణాపూర్ పోలీసులకు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.సీసీ కెమెరాల సహకారంతో బాధితుడి వస్తువును గుర్తించి తిరిగి అప్పగించడంపై పోలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జంగు, కానిస్టేబుల్ వెంకటేష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
previous post

