June 3, 2026
Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి బాలికలకు షీ టీం అవగాహన కార్యక్రమం

బెల్లంపల్లి బాలికలకు షీ టీం అవగాహన కార్యక్రమం

మంచిర్యాల జిల్లా షీ టీం ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ హైమ విద్యార్థులకు పోక్సో చట్టం, ఆకతాయిల వేధింపులు, మంచి–చెడు స్పర్శ, మానవ అక్రమ రవాణా, రహదారి నియమాలు, టీ సేఫ్ యాప్, షీ టీం సేవలపై వివరణాత్మకంగా వివరించారు. చిన్నారులపై వేధింపులకు కఠిన శిక్షలు ఉంటాయని, ఎలాంటి వేధింపులు జరిగినా భయపడకుండా వెంటనే డయల్ 100కు లేదా షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఉప కలెక్టర్ మనోజ్ విద్యార్థులు క్రమశిక్షణగా చదివి తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రోత్సహించారు.కార్యక్రమంలో అధికారులు దుర్గాప్రసాద్, ధర్మానంద్ గౌడ్, ప్రశాంత్, షీ టీమ్ సిబ్బంది జ్యోతి, శ్రవణ్, వసతి గృహ అధికారులు విజయలక్ష్మి, సుజాత, నిక్కత్ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

Share this