రామకృష్ణాపూర్,సెప్టెంబర్ 23(నేటి ప్రజా తెలంగాణ):గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా రామకృష్ణాపూర్ పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. పట్టణ ఎస్సై జె. శ్రీధర్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్‌లోని ప్రధాన కూడళ్లతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద పరిస్థితులను పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలతో పాటు డ్రోన్ ద్వారా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎస్సై జె. శ్రీధర్ సూచించారు.
previous post

