September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*గణేష్ మండళ్లకు పోలీసుల సూచన…. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి*

రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 10(నేటి ప్రజా తెలంగాణ): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండళ్లను ఏర్పాటు చేయనున్న నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రామకృష్ణాపూర్ పోలీసులు సూచించారు.గణేష్ మండళ్ల నిర్వాహకులు కింది లింక్‌ను ఓపెన్ చేసి, మండలికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్:
https://share.google/uuJ961D0jyD6NK3Af
ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీస్ శాఖకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉండేలా ప్రతి గణేష్ మండలి నిర్వాహకుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని పోలీసులు కోరారు.ఎలాంటి ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పోలీస్ శాఖకు సహకరించాలని రామకృష్ణాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Related posts

లోన్‌ యాప్‌.తస్మాత్‌ జాగ్రత్త

మంచిర్యాల‌ జిల్లాలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం: దోమల నియంత్రణపై కలెక్టర్ దృష్టి

Chief Editor: Satish Kumar
Share this