September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*క్యాతనపల్లిలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు*

క్యాతనపల్లి, సెప్టెంబరు 9 (నేటి ప్రజా తెలంగాణ): ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని క్యాతనపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు తెలంగాణ సమాజం పట్ల చేసిన సేవలను, ప్రజల సమస్యలను తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన తీరును స్మరించుకున్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజా ఉద్యమాల పట్ల కాళోజీ చూపిన నిబద్ధతను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్‌పర్సన్ గొడిశెల సంధ్యారాణి, కమిషనర్ ఎస్. మురళీకృష్ణ, వార్డు కౌన్సిలర్‌లు, పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్

తెలంగాణలో రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం*

47 వ డివిజన్ లో గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు

Share this