మంచిర్యాల,సెప్టెంబర్ 7(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ చెరువు కట్ట వద్ద పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆమె పాల్గొని పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయ నూతన నిర్మాణం విజయవంతంగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ప్రార్థించారు.అనంతరం సురేఖ ప్రేమ్‌సాగర్‌రావును స్థానిక కార్పొరేటర్ పూదరి విజయలక్ష్మి–తిరుపతి దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

