September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*పోలీస్ అధికారుల సంఘానికి కొత్త నాయకత్వం.. నవీన్, ఓంకార్‌కు ఘన సన్మానం*

రామకృష్ణాపూర్,సెప్టెంబర్ 1(నేటి ప్రజల తెలంగాణ):
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన నాయకులకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఘన సన్మానం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షణలో ఆగస్టు 31న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందికి నిర్వహించిన ఎన్నికల్లో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వడ్లకొండ్ల నవీన్ రామగుండం ప్రెసిడెంట్‌గా, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కె. ఓంకార్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్, ఓంకార్‌లను రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బాధ్యతలు మరింత పెరుగుతాయని అన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, సమన్వయం కోసం నూతన నాయకత్వం బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ నవీన్, జాయింట్ సెక్రటరీ ఓంకార్ ఎస్సై శ్రీధర్‌ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నవీన్, జాయింట్ సెక్రటరీ ఓంకార్‌తో పాటు మొగిళి మల్లేష్, జంగు, సతీష్, బాలకృష్ణ, అంకయ్య, డ్రైవర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుర్తింపు సంఘంతో 12 వ నిర్మాణాత్మక  సమీక్షా సమావేశం

*వీఐపీ భద్రతలో అప్రమత్తత, క్రమశిక్షణే కీలకం: సీపీ అంబర్ కిషోర్ ఝా*

*పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి భూమి పూజ*

Share this