September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*ఫోటోగ్రఫీని కళగా మలిచి గుర్తింపు పొందుతున్న జక్కుల రాజు*

మంచిర్యాల, ఆగస్టు 19(నేటి ప్రజా తెలంగాణ): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణానికి చెందిన ఉమా యాడ్స్ నిర్వాహకుడు, ఫోటోగ్రాఫర్ జక్కుల రాజు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం….

28 ఏళ్లకు పైగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో కొనసాగుతున్న జక్కుల రాజు మంచిర్యాల మున్సిపాలిటీ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలకు వివిధ సందర్భాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలు అందిస్తూ పలు కీలక కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఐదుసార్లు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలు అందించి రెవెన్యూ ఉన్నతాధికారుల ప్రశంసలు, అవార్డులు పొందారు.గాంధారి ఖిల్లాపై రాజు రూపొందించిన డాక్యుమెంటేషన్‌ను పరిశీలించిన నిర్మల్ జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఇన్‌చార్జి పీఓ వరుణ్‌రెడ్డి ఆయన ప్రతిభను అభినందించి సత్కరించారు. 2017లో అప్పటి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కర్జన్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జిల్లా ప్రతిభా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అద్భుతమైన ఫోటోగ్రఫీ, డాక్యుమెంటేషన్ అందించినందుకు అడిషనల్ కలెక్టర్ రాహుల్ కూడా రాజును సత్కరించారు.‘పోలీస్ మీకోసం’ కార్యక్రమానికి సంబంధించిన డాక్యుమెంటేషన్‌ను పరిశీలించిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ రాజు ప్రతిభను అభినందించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవాలపై ప్రత్యేక డాక్యుమెంటేషన్ రూపొందించి గుర్తింపు పొందిన రాజు రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలో పాల్గొని ద్వితీయ బహుమతి సాధించారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన పలు ఫోటోగ్రఫీ పోటీల్లోనూ అవార్డులు అందుకున్నారు.ఫోటోగ్రఫీపై ఉన్న ఆసక్తి, అంకితభావంతో అరుదైన దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తూ ప్రత్యేక డాక్యుమెంటేషన్లు రూపొందిస్తున్న రాజు పలువురు కలెక్టర్లు, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారుల ప్రశంసలు, సన్మానాలు పొందారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ఆర్టీఓ వొడ్నాల రాములు చేతుల మీదుగా జక్కుల రాజు ఉత్తమ ఫోటోగ్రాఫర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు అభినందించారు. తన కెమెరాతో చారిత్రక, సామాజిక, ప్రభుత్వ కార్యక్రమాలను సజీవ చిత్రాలుగా మలుస్తూ మంచిర్యాల ఫోటోగ్రఫీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన జక్కుల రాజు సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Related posts

పుస్తకాలోచ్చాయి, పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ కి చర్యలు

బెల్లంపల్లి ఆటో యూనియన్ నుండి అధిక సహాయం

అక్రమ పశువుల రవాణాపై పోలీసుల కఠిన నిఘా: డీసీపీ ఏ. భాస్కర్

Share this