September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*డయల్ 112కు సమాచారం.. అప్రమత్తతతో బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన రామకృష్ణాపూర్ పోలీసులు*

రామకృష్ణాపూర్,సెప్టెంబర్ 3:(నేటి ప్రజా తెలంగాణ) రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్రమత్తంగా వ్యవహరించిన స్థానికులు, సత్వర స్పందన చూపిన డయల్ 112, బాధ్యతాయుతంగా స్పందించిన పోలీసుల చర్యలతో గుర్తుతెలియని బాలుడు సురక్షితంగా తన తల్లిదండ్రుల చెంతకు చేరాడు.ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో అమ్మ గార్డెన్ చౌరస్తాలో ఒక గుర్తుతెలియని బాలుడు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వెంటనే డయల్ 112కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ బ్లూకోట్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం బాలుడిని విచారించగా, అతను మందమర్రి దొరల బంగ్లా ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.వెంటనే స్థానిక ఎస్సై జె. శ్రీధర్ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనుమానాస్పద పరిస్థితులు లేదా వ్యక్తులు కనిపించినప్పుడు ప్రజలు వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.

Related posts

*యంగ్ ఇండియా ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య*

బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్

Share this