September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం.. నిర్మానుష్య ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు*

రామకృష్ణాపూర్, ఆగస్టు 14:మాదకద్రవ్యాల అక్రమ సాగు, నిల్వ, రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సూచనలతో మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం గద్దెరేగడి, తిమ్మాపూర్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ డాగ్స్ సహాయంతో గంజాయి సాగు జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, మామిడి తోటలను క్షుణ్ణంగా పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ ఎస్‌ఐ జే. శ్రీధర్ మాట్లాడుతూ గంజాయి సాగు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, తమ పరిసరాల్లో గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ హ్యాండ్లర్ వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందులు విక్రయించాలి

*మహిళలు అప్రమత్తంగా ఉండాలి: షీ టీమ్ ఎస్‌ఐ లావణ్య*

*పెంపుడు కుక్కలు, పిల్లులకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలి: కలెక్టర్ కుమార్ దీపక్*

Share this