హైదరాబాద్: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 నంబర్‌కు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందాలని తెలంగాణ పోలీసులు సూచించారు. పోలీసు సేవలు, అగ్నిమాపక సహాయం, వైద్య అత్యవసర సేవలు, మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ 112 ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు.ప్రజలు 112 నంబర్‌ను తమ ఫోన్లలో భద్రపరచుకోవాలని, కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా ఈ అత్యవసర నంబర్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా 112కు సమాచారం అందించడం ద్వారా సకాలంలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.ప్రజల భద్రత, రక్షణ కోసం అందుబాటులో ఉన్న 112 అత్యవసర సేవలను అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
previous post

