September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు*

మంచిర్యాల, ఆగస్టు 8: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలను మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా.జై కిషన్ ఓజా తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాలను సమర్పించారు. కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన వృక్షానికి పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల ఊరేగింపు, ప్రత్యేక పూజలు, హారతులతో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. జై కిషన్ ఓజా మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యంతో పాటు ఐక్యతా భావాన్ని, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.కళాశాల సాంస్కృతిక సమన్వయకర్త డా. హరీష్ కుమార్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Related posts

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

ముగిసిన మంచిర్యాల కార్పొరేషన్ల ప్రమాణ ప్రమాణ స్వీకారాల కార్యక్రమం

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

Share this