October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన.. సమస్యల పరిష్కారమే పోలీసుల లక్ష్యం: సీపీ అంబర్ కిషోర్ ఝా*

రామగుండం, ఆగస్టు 3, 2026: ప్రజల సమస్యలకు సత్వర, పారదర్శక, నిష్పక్షపాత పరిష్కారం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.ప్రజలు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సీపీ సూచించారు. ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో ప్రాధాన్యతతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు రామగుండం పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

Related posts

జిల్లా కలెక్టర్, డీసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ పీఓ మంద మకరందు

సమ్మర్ కోచింగ్ క్యాంపులు – 2026 ప్రారంభం:జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారి

Chief Editor: Satish Kumar

*ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో 200 మట్టి వినాయకుల ఉచిత పంపిణీ*

Chief Editor: Satish Kumar
Share this