July 27, 2026
Praja Telangana
తెలంగాణ

*ట్రినిటీ బుక్ స్టాల్‌పై విద్యాశాఖ ఉక్కుపాదం.. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలపై చర్యలు, జై శ్రీ బట్టల షాప్ సీజ్.. అక్రమాలపై లోతైన విచారణ: విద్యాశాఖ పిడి లలిత*

మంచిర్యాలలోని ట్రినిటీ పాఠశాలకు సంబంధించిన బుక్ స్టాల్‌లో విద్యార్థులకు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు బుక్ స్టాల్‌ను పరిశీలించి పలు అంశాలను గుర్తించారు.విద్యాశాఖ పీడీ లలిత ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో పుస్తకాల విక్రయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేవని, విద్యార్థులకు పుస్తకాలు విక్రయించిన సమయంలో రసీదులు కూడా అందించడం లేదని గుర్తించినట్లు తెలిపారు.ఈ బుక్ విక్రయాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని పీడీ లలిత తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని పేర్కొన్నారు.ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా పుస్తక విక్రయాలు జరుగుతున్న జై శ్రీ బట్టల షాప్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరి ప్రమేయం ఉంది అనే కోణంలో ఒకటి రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.విద్యార్థులు, తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం పడకుండా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Related posts

*తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు*

Share this