September 11, 2026
Praja Telangana
తెలంగాణ

శిథిల గృహంలో వృద్ధురాలి దుస్థితి.. తక్షణ సహాయానికి చైర్‌పర్సన్ సంధ్యారాణి హామీ

క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు శ్రీనివాస్ నగర్‌లో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో నివసిస్తున్న ఒంటరి వితంతు వృద్ధురాలు పాశం బూధమ్మను మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి – రాజారమేష్ పరామర్శించారు.ఇటీవల వీచిన ఈదురుగాలులకు ఇంటి పైకప్పు లేచిపోవడంతో గృహం ప్రమాదకర స్థితికి చేరిందని తెలుసుకున్న చైర్‌పర్సన్స్వ యంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇల్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.వెంటనే సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బూధమ్మకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మంత్రి వివేక్ వెంకటస్వామితో మాట్లాడి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు అయ్యేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.అవసరమైతే తాత్కాలిక సహాయం కూడా అందిస్తామని పేర్కొన్నారు.బూధమ్మకు అన్ని విధాలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చైర్‌పర్సన్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామిడి ఉమాదేవి,రామిడి కుమార్,యువ నాయకులు లక్ష్మీకాంత్, మణి,కాలనీ వాసులు రవళి,విజయ,సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

*అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ అఖిల్ మహాజన్*

*సికిల్ సెల్ వ్యాధిపై అవగాహనతోనే నివారణ : డాక్టర్ సుధాకర్ నాయక్*

*గద్దెరేగాడిలో అనుమానాస్పద కాటుతో యువకుడి మృతి.. కేసు నమోదు చేసిన రామకృష్ణాపూర్ పోలీసులు*

Chief Editor: Satish Kumar
Share this