September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరం : మేయర్ ధరణి మధుకర్*

మంచిర్యాల,జూన్21:మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ,ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు,ఆయుష్ విభాగం సమన్వయంతో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. యోగా జీవితంలోని అన్ని అంశాల మధ్య సమతుల్యతను తీసుకురావడంతో పాటు శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మంచి అలవాట్లను పెంపొందిస్తుందని అన్నారు.ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అసంక్రమణ వ్యాధులు పెరుగుతున్నాయని,వీటి నియంత్రణకు యోగా,ధ్యానం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతిరోజూ 15 నుంచి 30 నిమిషాల పాటు యోగా సాధన చేయడం ద్వారా శరీర స్థిరత్వం, జీర్ణక్రియ మెరుగుదల, ఒత్తిడి తగ్గింపు,బరువు నియంత్రణ వంటి ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త సురేఖ ప్రేమ్ సాగర్ రావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్,ఆయుష్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మజ,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

*వ్యాక్సినేషన్, ఆరోగ్య సేవల అమలులో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

*పర్యావరణహితంగా రాష్ట్ర గ్రీన్ కోర్ డైరెక్టర్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్నకుమార్ ఉద్యోగ విరమణోత్సవం ఘనంగా నిర్వహణ*

Share this