మంచిర్యాల,జూన్ 20:మంచిర్యాల జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో వయోజన విద్య మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమంపై మెప్మా సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వయోజన విద్యాశాఖ ప్రాజెక్ట్ అధికారి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్–అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మెప్మా సిబ్బంది పూర్తి సహకారం అందించాలని కోరారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులు,స్వచ్ఛంద ఉపాధ్యాయుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని, చదువుకు దూరంగా ఉన్న అర్హులైన వారిని గుర్తించి వారికి విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో విద్యపై అవగాహన పెంచి నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలని పేర్కొన్నారు.అనంతరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం విజయవంతానికి మెప్మా తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. శిక్షణ ద్వారా పొందిన అవగాహనను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సుభాష్, రిసోర్స్ పర్సన్ ఎం.సుమన్ టీ.ఎం.సీ లు చందయ్య,దుర్గయ్య, శ్రీధర్, రఘురామ్, నాగరాజు,శంకరయ్య, రామకృష్ణ,పట్టణ సమాఖ్య ప్రతినిధులు,మెప్మా సిఓ లు అరుణ,సుజాత, సరోజ తదితరులు పాల్గొన్నారు.

