July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*వ్యాక్సినేషన్, ఆరోగ్య సేవల అమలులో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

జైపూర్,జూలై 15:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మిట్టపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రం, కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందారం ఉపకేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఆరోగ్య సేవలను పరిశీలించారు.మిట్టపల్లి ఉపకేంద్రంలో స్థానిక సర్పంచ్, జిల్లా నాణ్యత నిర్వహణ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులతో సమీక్ష నిర్వహించి ఉపకేంద్రాన్ని జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అనంతరం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఇందారం ఉపకేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బందితో సమావేశమై గర్భిణుల నమోదును వంద శాతం పూర్తి చేయడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రతి బుధవారం, శనివారం నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. టీకాలు వేయించాల్సిన చిన్నారుల జాబితాను ముందుగానే సిద్ధం చేయాలని, అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉంచాలని, ఆశా కార్యకర్తలు ఒక రోజు ముందుగానే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, వారానికి రెండు రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, జ్వర సర్వేలు నిర్వహించాలని సూచించారు. అసంక్రమణ, క్షయవ్యాధుల గుర్తింపు, నమోదు, చికిత్స, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వెంకట్ సాయి, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

*సింగరేణి ఐరన్ పైపుల అక్రమ రవాణా గుట్టురట్టు.. సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారి సహా ఆరుగురు అరెస్ట్*

*ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి*

*ప్రజలకు చట్టబద్ధంగా, మర్యాదపూర్వకంగా సేవలందించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

Share this