August 5, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రకృతి పరిరక్షణపై అవగాహనకు “ప్రకృతిమిత్ర” జిల్లా అడహక్ కమిటీ ఎంపిక*

కరీంనగర్, జూన్ 13:కరీంనగర్ జిల్లా “ప్రకృతిమిత్ర” అడహక్ కమిటీ ఎంపిక కార్యక్రమం శనివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ కార్యాలయంలో నిర్వహించారు.సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎంపిక చేశారు.ఈ సందర్భంగా గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో భాగంగా చెట్లు, మట్టి, గాలి, నీరు, జీవ వైవిధ్య రక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, కాలుష్య నివారణ వంటి అంశాలపై ప్రజలు, యువత, విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే “ప్రకృతిమిత్ర” ప్రధాన లక్ష్యమన్నారు. ప్రకృతి పట్ల బాధ్యత కలిగిన వారిని ప్రకృతి మిత్రులుగా ప్రోత్సహిస్తామని తెలిపారు.త్వరలో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు.ప్రకృతి రక్షణకు కృషి చేయాలనుకునే వారు, వృక్షాలు,పక్షుల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారు, మిద్దె తోటలు, పెరటి తోటలు,కిచెన్ గార్డెన్ నిర్వహించే వారు “ప్రకృతిమిత్ర”లో భాగస్వాములు కావాలని, 9849254747 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

ఎంపికైన కమిటీ వివరాలు:
అధ్యక్షుడిగా కొత్తూరి ముకుందం,ప్రధాన కార్యదర్శిగా ఎస్. హర్జిత్ సింగ్,కోశాధికారిగా గద్దె రవికుమార్,సలహాదారులుగా డా.సబ్బని లక్ష్మీనారాయణ,డా.సంగోజు మనోహరాచారి,ఉమ్మెంతల రఘురాం రెడ్డి,కె.అనంతాచార్య,మాడిశెట్టి గోపాల్,చాడ జైపాల్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా బత్తిని శ్రీనివాస్,కట్ట రామస్వామి,సంయుక్త కార్యదర్శులుగా షౌకత్ హుస్సేన్, కొత్తకొండ శ్రీనివాస్,సాంస్కృతిక కార్యదర్శులుగా ఈద కుమార్,తేలు విజయ,రాజేష్ భరద్వాజ్,కార్యవర్గ సభ్యులుగా పుల్లె సత్యనారాయణ,శ్రీ రామోజీ రవికుమార్ ఎంపికయ్యారు.

Related posts

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో హిందూ స్మశానవాటికకు భూమి పూజ

తెలంగాణ : వర్షాకాల సన్నద్ధత.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Share this