September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి ‘ప్రకృతిమిత్ర’ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం : సింగరేణి జీఎం శ్రీనివాస్*

శ్రీరాంపూర్,జూన్ 2:ప్రకృతి,పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని శ్రీరాంపూర్ సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు.జిల్లాలో పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన ‘ప్రకృతిమిత్ర’తెలంగాణ పర్యావరణ సామాజిక సంస్థ సభ్యులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని మొక్కను బహుకరించారు.ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర వ్యవస్థాపకులు,రాష్ట్ర పర్యావరణవేత్త గుండేటీ యోగేశ్వర్ మాట్లాడుతూ అడవుల సంరక్షణ,పర్యావరణ పరిరక్షణ,కాలుష్య నివారణ,పచ్చదనం పెంపు వంటి అంశాలపై సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.జిల్లాలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా సంస్థ సేవలను విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
సింగరేణి జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్న ‘ప్రకృతిమిత్ర’ సభ్యుల సేవలు అభినందనీయమన్నారు.సంస్థ చేపట్టే కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గోసిక మల్లేష్,నాగేశ్వరరావు,కె.రాజు,శరత్ చంద్ర,బోయిన రాజశేఖర్,రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

*వీధి వ్యాపారుల అభ్యున్నతికి చేయూత.. రుణాలతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు*

ఘనంగా టైలర్స్ డే దినోత్సవం వేడుకలు

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి

Chief Editor: Satish Kumar
Share this