మంచిర్యాల,జూన్ 1:అతిసార వ్యాధి కారణంగా చిన్నారుల మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో స్టాప్ డయేరియా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్.అనిత మాట్లాడుతూ జూన్1 నుండి 15 వరకు తొలి దశలో అవగాహన కార్యక్రమాలు,జూన్ 16 నుంచి జూలై 31 వరకు రెండో దశలో ప్రతి గ్రామంలో ఓఆర్ఎస్,జింక్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి అవసరమైన వారికి ఓఆర్ఎస్ అందించాలని సూచించారు.సురక్షిత తాగునీరు,పరిశుభ్రత,చేతులు శుభ్రంగా కడుక్కోవడం,తల్లిపాలు,పోషకాహారం,రోటావైరస్ టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాలు,స్లమ్‌లు,వలస జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రశాంతి,సుమన్,వసుమతి,రాజేష్,నీలిమ,సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

