మంచిర్యాల,మే20:సేవే పరమావధిగా మహేష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో వాటర్ ట్యాంక్ చౌరస్తా యందు సోమవారం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్వప్నిక డాక్టర్ మరియు స్ఫూర్తి స్పాన్సర్లుగా సహకారం అందించారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది.ఈ సందర్భంగా స్వప్నిక మాట్లాడుతూ వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలనే సంకల్పంతో అంబలి పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.మహేష్ డాన్స్ అకాడమీ నిర్వాహకుడు మహేష్ మాట్లాడుతూ ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.కళలతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకొని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో కూడా మహేష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక యువత,అకాడమీ సభ్యులు వంశీ, శివ,మహేందర్,మహేష్,సాయి,వెంకటేష్, శాన్విక,తనుస్య,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

